
బోధన మెలకువలపై శిక్షణ
అడ్డతీగల: విద్యాబోధనలో మెలకువలపై శిక్షణలో డీఎస్సీ ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వర్రావు సూచించారు. మెగా డీఎస్సీ 2025లో ఎంపికై న 198 మంది సెకెండరీ లెవెల్ ఉపాధ్యాయులకు వేటమామిడిలోని హోసన్నా పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన సెకెండరీ లెవెల్ టీచర్లు బయాలజీ, గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్‌ల్లో శిక్షణ ఇస్తారన్నారు. విద్యాశాఖలో అమలయ్యే విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. శిక్షణలోని అంశాలను బోధనలో చూపించి మెరుగైన విద్యాప్రమాణాల పెంపునకు బాటలు వేయాలని ఏటీడీబ్ల్యూవో కృష్ణమోహన్ అన్నారు. రాజవొమ్మంగి ఎంఈవో–1 కె.సత్యనారాయణ, అడ్డతీగల ఎంఈవోలు కె.రమేష్, పి.శ్రీనివాసరావు, కోర్సు డైరెక్టర్, హోసన్నా పాఠశాల డైరెక్టర్ డానియేల్ సందీప్, ప్రిన్సిపాల్ మృధుహాసిని పాల్గొన్నారు.