
ముమ్మరంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు
పాడేరురూరల్: అల్లూరి జిల్లా పరిధిలో జోరుగా విద్యుత్ పునరుద్ధరణ, జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరం చేసిన్నట్టు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగ్గిపడి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో కొయ్యూరు, జి.మాడుగుల, పెదబయలు, అనంతగిరి, అరకులోయ, పాడేరు, హుకుంపేట తదితర మండలాల్లో ఫీడర్‌లలో మరమ్మతు పనులు, విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల కొమ్మలు, తెగిపడిన వైర్లు సరిచేయడం, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులు ముమ్మరంగా చేపట్టామన్నారు. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండ ముందస్తు చర్యలు తీసుకోంటున్నామన్నారు.ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సమీప విద్యుత్ శాఖ అధికారులకు సమచారం ఇవ్వాలని ఆయన కోరారు.