
నూకాంబిక సేవలో కలెక్టర్లు
అనకాపల్లి: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని గురువారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, ఎస్.దినేష్ కుమార్, హరిందర ప్రసాద్ దర్శించుకున్నారు. తొలుత వీరికి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూర్ణాహుతి హోమం, అవభృత స్నానం, శమీ వృక్షపూజలు చేయించారు. అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

నూకాంబిక సేవలో కలెక్టర్లు

నూకాంబిక సేవలో కలెక్టర్లు