
మాదక ద్రవ్యాలతోపట్టుబడితే కఠిన చర్యలు
● పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్
డుంబ్రిగుడ: గంజాయి వంటి మాదకద్రవ్యాలతో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పాడేరు డీఎస్పీ షెహబాజ్ అహ్మద్ హెచ్చరించారు. స్థానిక ఎస్‌ఐ కె.పాపినాయుడు ఆధ్వర్యంలో పోతంగి పంచాయతీ కోసంగిలో మంగళవారం గిరిజనులతో మాట్లాడారు. గంజాయితో పట్టుబడితే జైలు తప్పదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టరీత్యా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలతోపాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సర్పంచ్ వి.వెంకటరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.