
స్లాట్ బుకింగ్‌పై అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్‌టౌన్: కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్, నిర్మల్ ఏఈవోలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత ఏడు రోజుల వరకు పంట విక్రయించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మూడుసార్లు బుకింగ్ చేసిన తర్వాత కూడా మార్కెట్‌కు పత్తి తీసుకురాకపోతే బ్లాక్‌లిస్టులో పడుతుందని తెలి పారు. ఆ తర్వాత రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి విక్రయించుకోవచ్చని సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పత్తి విక్రయించే తేది ప్రకటించిన తర్వాత స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఏఈవోలు ఆయా గ్రామాల్లో విద్యావంతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ కోసం ఎవరు కూడా రైతుల నుంచి డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఫిబ్రవరి వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్‌డెస్క్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 8 నుంచి 12 శాతం తేమతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మా ర్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌స్వామి, మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్, టెక్నికల్ ఏవో శివకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలు తది తరులు పాల్గొన్నారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకతతో నిష్పక్షపాతంగా నిర్వహించా లని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులు, స్టేజ్–1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనుసరించాల్సిన విధి విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఆర్‌వోలదే కీలకపాత్ర అన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూ చించారు. ప్రిసైడింగ్ అధికారులకు మండలాల్లోనే శిక్షణ ఇచ్చినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీవో రమేశ్, డీఎల్‌పీవో ఫణిందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.