
నిరంతర నిఘా
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలి. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టొద్దు. జిల్లాలో నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా 14 ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను నియమించాం. ఎక్కడైనా ‘కోడ్’ ఉల్లంఘన జరి గినా, మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసినట్లు తెలిసినా వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం టోల్‌ఫ్రీ నంబర్ 18004251939 కు సమాచారం అందించాలి. వాటిపై సత్వరమే స్పందించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– రాజర్షి షా, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి