
జోష్‌గా..
సాక్షి,ఆదిలాబాద్: దసరా వేడుకలను ప్రజలు ధూమ్‌దామ్‌గా జరుపుకున్నారు. ఎక్కడా జోరు తగ్గించలేదు. గాంధీ జయంతి ప్రభావంతో మార్కెట్లో బహిరంగంగా ఉల్లంఘనలు జరగకపోయినప్పటికీ లోలోపల మాత్రం యథేచ్ఛగా కొనసాగాయి. మద్యం దుకాణాలు మూసివేసి ఉంచగా, బహిరంగంగా మాంసం విక్రయాలు చేపట్టలేదు. లిక్కర్‌ను ముందే కొనుగోలు చేసిన మద్యం ప్రియులు పండుగ జోష్‌లో రాజీపడలేదు. లోలోపల మేకలు, గొర్రెలు, కోళ్ల వధ చోటుచేసుకుని.. మటన్, చికెన్ విక్రయాలు సాగాయి.
మార్కెట్‌పై ప్రభావం
అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండగ కలిసి రావడంతో ఆ ప్రభావం బహిరంగ మార్కెట్‌పై పడింది. ప్రధానంగా దసరా పండగ అంటేనే మద్యం, మాంసం విక్రయాలతో సంబంధం ఉన్న వేడుక. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలన్నీ మూసివేశారు. అలాగే స్లాటర్ హౌస్‌లలో ఎక్కడ కూడా పశువధ జరగలేదు. అయితే జిల్లాలో వారం రోజులుగా లిక్కర్, బీర్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. మద్యం ప్రియులు పండుగకు ముందుగానే స్టాక్ తీసుకొని ఇంట్లో నిల్వ చేసుకున్నారు. అలాగే మాంసం విక్రయదారులు తమ ఇళ్లలో, లేనిపక్షంలో ఏదైనా అనువైన స్థలంలో మేకలు, కోళ్లను వధించారు.
కిక్కెక్కించిన మద్యం..
జిల్లాలో గడిచిన ఆరు రోజుల్లో రూ.6.84 కోట్ల మ ద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే సుమారు 10 శాతం పెరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 12,564 కేసుల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. అందులో 9,932 కేసుల లిక్కర్, 2,632 కేసుల బీర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో దసరా రోజు సుమారు 15 టన్నుల వర కు మాంసం విక్రయాలు జరిగాయి. ఇందులో 5 ట న్నుల వరకు మటన్, 10 టన్నుల వరకు చికెన్ విక్రయాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.