
ప్రజలంతా విజయం సాధించాలి
ఆదిలాబాద్‌టౌన్: విజయదశమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ప్రజలంతా విజయం సాధించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధ భాండాగారంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్‌శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి,వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్‌పోర్టు టీం, తదితరులు పాల్గొన్నారు.
వినూత్నంగా ‘హాకీ’ ఆయుధపూజ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలను వినూత్నంగా నిర్వహించా రు. హాకీ స్టిక్స్, గోల్ పోస్టులకు పూజలు చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పార్థసార థి మాట్లాడుతూ, జిల్లా క్రీడాకారులు ఈ ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించా రు. ఇందులో బాస్కెట్‌బాల్ జాతీయ క్రీడాకారుడు రాధాకృష్ణ, సీనియర్ హాకీ క్రీడాకారులు జే రవీందర్, సుధీర్, గోవింద్, అతుల్, విజయ్, శేఖర్, జంగు తదితరులు పాల్గొన్నారు.