కైలాస్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ రోజు వరకు ఆర్‌వోలు అనుసరించాల్సిన విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున, పకడ్బందీగా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్‌వోలు, ఎంపీడీవోలపై ఉందన్నారు. కోడ్ ఉల్లంఘనలు జరగకుండా శ్రద్ధ వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా