
తొమ్మిది ఉద్యోగాలకు ఎంపికై న ఉదయ్
పోటీ పరీక్ష ఏదయినా కొలువు కొట్టడమే ఆనవాయితీగా మా ర్చుకున్నాడు బిట్లింగ్ ఉదయ్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్ కొలువు సాధించాడు. బజార్‌హత్నూర్‌కు చెందిన లక్ష్మణ్– సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో నివా సం ఉంటున్నాడు. తండ్రి రేషన్ డీలర్ కాగా, తల్లి గృహిణి. 2019లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పోస్టల్ అసిస్టెంట్, పంచాయతీరాజ్‌లో జూనియర్ అసిస్టెంట్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్–3లో 72వ ర్యాంక్ సాధించాడు. అలాగే ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్‌గా ఎంపికై 2024 నుంచి ఆదిలాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–2లో 51వ ర్యాంక్ సాధించి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యాడు. సివిల్స్‌కు ఎంపిక కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఉదయ్.
ఉదయ్