
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
నేరడిగొండ: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వి నియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. పలు రికార్డులను పరిశిలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్న రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. గర్భిణులు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సద్దాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.