● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు దక్కిన ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారి’ పురస్కారం ● రూ.2 కోట్ల నగదు కూడా.. ● రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకోనున్న కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు దక్కిన ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారి’ పురస్కారం ● రూ.2 కోట్ల నగదు కూడా.. ● రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకోనున్న కలెక్టర్‌

Sep 27 2025 4:47 AM | Updated on Sep 27 2025 4:47 AM

● జల

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు ద

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు దక్కిన ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారి’ పురస్కారం ● రూ.2 కోట్ల నగదు కూడా.. ● రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకోనున్న కలెక్టర్‌

కలెక్టర్‌కు సన్మానం

జిల్లాకు జల్‌ సంచయ్‌ జన భాగీదారి జాతీ య పురస్కారం వరించడంపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు, ఉపాధి హామీ ఏపీవోలు, ఇతర సిబ్బంది శుక్రవారం కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపా రు. ఇందులో ఏడీఆర్డీవో కుటంబరావు, ఏపీ డీ కృష్ణారావు, ఏవో అందె గంగాధర్‌ తదితరులున్నారు. అంతకు ముందు ఈజీఎస్‌లో పనిచేసే ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు డీఆర్డీవోను సత్కరించి అభినందనలు తెలిపారు.

కై లాస్‌నగర్‌: జిల్లాకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. నీటి సంరక్షణ చర్యలకు గాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో నాలుగోస్థానం కై వసం చేసుకుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీ దారి’ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి కలెక్టర్‌ రాజర్షి షాకు ఉత్తర్వులు అందాయి. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్‌ ఈ అవార్డు అందుకోనున్నారు. దీని కింద రూ.2కోట్ల నగదు కూడా అందనుంది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పురస్కారం వరించిందిలా..

నీటి సంరక్షణ ప్రాధాన్యత చాటి చెప్పడంతో పాటు ఆయా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసేలా కేంద్ర ప్రభుత్వం జల్‌ సంచయ్‌.. జన భాగీ దారి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అడవుల జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్‌లో గుట్టలు, రాళ్లు రప్పలతో కూడిన భూములే అధికం. వర్షపునీరంతా భూమిలోకి చేరేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యలో పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద పంట చేలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, బోర్‌వెల్స్‌, కాలువల వద్ద ప్రత్యే క నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా నీటి సంరక్షణ పనులు చేపట్టి 98వేల ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశా రు. వాటిని పరిశీలించిన కేంద్రం జిల్లాకు ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఈ ఏడా ది జూన్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ నీటి కమిషన్‌ సభ్యులు నెల పాటు ఇక్కడే ఉండి జిల్లాలో చేపట్టిన ఆయా పనులను పరిశీలించారు. వెయ్యి ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని పరిగణలోకి తీసుకున్న జల్‌శక్తి మంత్రిత్వ శాఖ జిల్లాకు పురస్కారం ప్రకటించింది.

జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలివి..

వర్షపు నీటిని బొట్టుబొట్టుగా ఒడిసి పట్టి సంరక్షించడమే లక్ష్యంగా వాగులు, చెరువుల వద్ద ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున చెక్‌డ్యాంలను నిర్మించారు. వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో పంటచేలకు నీటిని ఉపయోగించుకునేలా ఊటకుంటలు, కంటూరు కందకాలు, మ్యాజిక్‌ సోక్‌పిట్లు, బోర్‌వెల్స్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్స్‌, ఫిష్‌ పాండ్స్‌, ఫార్మర్స్‌ బౌండ్రీ ట్రెంచెస్‌ వంటి నిర్మాణాల ను భారీగా చేపట్టారు. వీటితో పాటు గ్రామాల్లోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు వీలుగా ఉపాధి కూలీలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి పూడిక తీత పనులు చేపట్టారు. ప్రధానంగా వేసవి లో నీటి ఎద్దడి నెలకొనే ఏజెన్సీ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌, సిరికొండ, గాదిగూడ వంటి మండలాల్లో ఈ కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించారు. వీటి ద్వారా భూగర్భజలాలు పెంపొంది నీటి ఎద్ద డి నియంత్రణకు దోహదపడింది. తద్వారా జాతీయ అవార్డు వచ్చేందుకు తోడ్పడింది.

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు ద1
1/2

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు ద

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు ద2
2/2

● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు ద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement