
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కై లాస్‌నగర్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు మాట్లాడుతూ, వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మూడు నెలల బకాయిలతో పాటు దసరా పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలను గ్రీన్‌చానల్ ద్వారా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలన్నా రు. అనంతరం అతనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో యూనియన్ నాయకులు ఎస్.రవి, గంగన్న, అశోక్, ప్రమోద్, హనుమాన్లు, మారుతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.