
పంట కాలం పెరిగినట్టే..
పత్తి పంట కాలం సుమారు నెల పాటు పెరిగినట్టే. ప్రస్తుతం మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రైతులు చేలల్లో పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. వర్షాలు తగ్గిన తర్వాతే ఏదైనా చేపట్టాలి. వానలు తగ్గిన తర్వాత పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడితే పూత, గూడు, కాయ పోయిన చోట మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే అవసరమైన ఎరువులు ఇవ్వాలి. దీంతోపాటు సూక్ష్మధాతువు లోపాల నివారణకు పోషక విలువ కల్పించాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో చలి పెరిగే అవకాశాలు ఉన్నందున రసం పీల్చే పురుగులతో పాటు ఇతర పురుగుల ప్రభావం పెరుగుతుంది. వాటి నివారణకు కూడా మందులు వాడాలి. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం