కొత్త కిక్కు | - | Sakshi
Sakshi News home page

కొత్త కిక్కు

Sep 27 2025 4:47 AM | Updated on Sep 27 2025 4:47 AM

కొత్త కిక్కు

కొత్త కిక్కు

మద్యం షాపులకు ఎకై ్సజ్‌ పాలసీ గెజిట్‌ విడుదల

ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ

తొలిరోజు నిల్‌..

అక్టోబర్‌ 18 వరకు గడువు

ఆదిలాబాద్‌టౌన్‌: మద్యం షాపుల ఎకై ్సజ్‌ పాలసీ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 40 షాపులకు గాను టెండర్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అక్టోబర్‌ 18 వరకు కొనసాగనుంది. తొలి రోజు ఒక్క టెండర్‌ కూడా నమోదు కాలేదు. రెండేళ్ల క్రితం జిల్లాలో 975 టెండర్లు నమోదవగా, వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.19.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దాదాపు వెయ్యికి పైగా దాఖలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

జిల్లాలో ..

జిల్లాలో మొత్తం 40 వైన్‌షాపులు ఉండగా ఇందులో 15 రిజర్వు చేశారు. 25 జనరల్‌గా కేటాయించారు. ఎస్సీలకు 1, 4, 18, 21, 28 షాపులను రిజర్వు చేశారు. గౌడకులస్తులకు అడెగామ–కే లోని 25వ షాపును కేటాయించారు. ఎస్టీలకు ఉట్నూర్‌ ఎకై ్సజ్‌స్టేషన్‌ పరిధిలోని తొమ్మిది షాపులను రిజర్వు చేశారు. అందులో 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 షాపులున్నాయి.

దరఖాస్తు ఇలా..

మద్యం షాపుల టెండర్లకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆదిలా బాద్‌ ఎకై ్సజ్‌స్టేషన్‌ పరిధికి సంబంధించి రెండు, ఇచ్చోడ, ఉట్నూర్‌ స్టేషన్లకు ఒక్కోటి చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు డీడీ లేక, చలాన్లు చెల్లించి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్‌ జిరా క్స్‌, పాన్‌కార్డు, రిజర్వు షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కులధ్రువీకరణ పత్రాలు, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు ఏజెన్సీ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు మూడు పాస్‌ ఫొటోలు జతచేయాలని ఎౖక్సైజ్‌ అధికారులు పే ర్కొంటున్నారు. 21ఏళ్లు నిండిన వారు టెండర్‌లో పాల్గొనవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్ర మే లక్కీడ్రాలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తా రు. డ్రాలో షాపులు దక్కించుకున్న వారు అదే రోజు రెండు నెలలకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రెండేళ్ల పాటు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో 12 సార్లు, రెండు నెలకోసారి ఎకై ్సజ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. షాపులకు సంబంధించి మూడు స్లాబ్‌లుగా విభజించారు. ఆదిలా బాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటన్నింటికి రూ.65లక్షలు, రూ.55లక్షలు, రూ.50లక్షల చొప్పు న మూడు స్లాబ్‌లున్నాయి.ఆయా దుకాణాల స్లాబు కు అనుగుణంగా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది దరఖాస్తు ఫీజు రూ.3లక్షలుగా నిర్ణయించారు.

23న లక్కీడ్రా..

నూతన మద్యం టెండర్లకు సంబంధించిన పాలసీ విడుదల చేశాం. అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తు గడువు ఉంది. దరఖాస్తు ఫారాలు సమర్పించేందుకు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్టోబర్‌ 23న జిల్లా కేంద్రంలోని రత్నా గార్డెన్‌లో కలెక్టర్‌ చేతుల మీదుగా లక్కీడ్రా ప్రక్రియ ఉంటుంది.

– హేమశ్రీ, డీపీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement