
వడ్డీ వ్యాపారులపై కొరడా
● జిల్లాలో ఏకకాలంలో దాడులు ● 43 బృందాలతో.. 13 మండలాల్లో తనిఖీలు ● 18 మందిపై కేసులు
ఆదిలాబాద్‌టౌన్: వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 13 మండలా ల్లో 43 బృందాలతో శుక్రవారం దాడులు ని ర్వహించారు. అధిక వడ్డీతో రైతుల నడ్డీ విరుస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకొని, భూములు రాయించుకొని కొంత మంది వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారని తెలి పారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించి పది పోలీసు స్టేషన్ల పరిధిలో 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్‌లు, చెక్కులు, బాండ్ పేపర్లు, సేల్‌డీడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నార్నూర్‌లో బంగారం కు దువపెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వ్యాపారి నుంచి 12 గ్రాముల బంగారం, 235 గ్రాముల వెండీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మీప్రసన్న జ్యూయలరీ యజ మాని నిందితుడు ఉట్ల రవిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో 2 కేసులు, టూటౌన్‌లో 1, తలమడుగులో 2, బజార్‌హత్నూర్‌లో 4, బేలలో 1, ఇచ్చోడలో 3, గుడిహత్నూర్‌లో 1, నార్నూర్‌లో 1, ఇంద్రవెల్లిలో 1, ఉట్నూర్‌లో 2 మొత్తం 18 కేసులు నమోదైనట్లు తెలి పారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో వ్యాపారం చేసే వారు ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.