
చాలా సంతోషంగా ఉంది
జల్ సంచయ్.. జన్ భాగీదారి జాతీయ స్థాయి పురస్కారానికి జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల కృషి అభినందనీయం. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించేలా జిల్లాలో అనేక కార్యక్రమాలను అమలు చేశాం. ప్రధానంగా ఏజెన్సీ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టాం. అవార్డు ద్వారా వచ్చే రూ.2కోట్లతో మరిన్ని నీటి సంరక్షణ చర్యలు చేపడుతాం.
– రాజర్షి షా, కలెక్టర్
జిల్లాకు గర్వకారణం
నీటి సంరక్షణలో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం, దేశంలో నాలుగో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికవడం గర్వకారణంగా ఉంది. కలెక్టర్ రాజర్షి షా మార్గదర్శకంలో వారి సూచనలకు అనుగుణంగా పనులు చేపట్టాం. సమష్టి కృషి ఫలితమే ఈ అవార్డు. ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం మరింత ఉత్సాహన్ని అందిస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో

చాలా సంతోషంగా ఉంది