
సౌత్ జోన్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇంది రాప్రియదర్శిని స్టే డియంలోగల ఆది లాబాద్ క్రీడా పా ఠశాలకు చెందిన విద్యార్థి ఎస్.చరణ్ సౌత్ జోన్ జాతీ యస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రా రంభమైన 36వ సౌత్ జోన్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ట్రయాథ్లాన్–ఏ పోటీల్లో గురువారం స్వర్ణంతో మెరిసినట్లు అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ తెలిపారు. ఈ సంవత్సరం అథ్లెటిక్స్ పోటీల్లో జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన తొలి అథ్లెట్ చరణ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చరణ్‌ను డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు అభినందించారు.