
భద్రత దృష్ట్యా కార్యాలయం మార్పు
ఆదిలాబాద్‌టౌన్: భారీ వర్షాలతో కలెక్టరేట్‌లోని పై అంతస్తులో ఓ భాగం కూలిందని, ఉద్యోగులతో పా టు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల భద్రత ని మిత్తం కార్యాలయాన్ని మార్చినట్లు కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఏ,బి,సీ,డీ,ఈ,ఎఫ్ సెక్షన్లను పెన్‌గంగ భవన్‌లోకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఈ కార్యాలయంలోనే కార్యకలాపాలు సాగుతాయని తెలిపా రు. కలెక్టరేట్‌లో తన చాంబర్‌తో పాటు డీపీఆర్‌వో, ట్రెజరీ కార్యాలయాలకు ఎలాంటి ముప్పు లేదని నివేదికలు ఇచ్చినట్లు చెప్పారు. అంతకుముందు కార్యాలయాన్ని షిఫ్ట్ చేయగా, కలెక్టర్ పూజలు చేసి ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్‌లు కలెక్టర్‌ను సత్కరించారు. ఇందులో ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు.
నేటి నుంచి అధికారికంగా బతుకమ్మ సంబరాలు
కై లాస్‌నగర్: బతుకమ్మ సంబరాలను మంగళవారం నుంచి జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి చైర్‌పర్సన్‌గా, డీడబ్ల్యూవో, డీఎస్సీడీఓ, డీపీఆర్వో, డీఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా యువజన క్రీడల అధికారితో కూడిన ప్రత్యేక కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. తొలిరోజున జిల్లా కేంద్రంలోని సంక్షేమశాఖల సముదాయ భవన్‌లో సాయంత్రం 4గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ ఆడే, నిమజ్జన ప్రాంతాల్లో తగు వసతులు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.