
నలుగురు ల్యాబ్‌టెక్నీషియన్లకు బయోకెమిస్ట్‌గా ప్రమోషన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరో గ్యకేంద్రాల్లో ల్యాబ్‌టెక్నీషియన్లుగా పనిచేస్తున్న న లుగురికి బయోకెమిస్ట్‌గా ప్రమోషన్ కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేందర్ కుమార్ శని వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పది మందికి ప్రమోషన్ కల్పించగా ఇందులో జిల్లా నుంచి నలుగురున్నారు. దీంతో వీరికి ప్రభు త్వ వైద్యకళాశాలలో గెజిటెడ్ హోదా లభించింది. గిమ్మ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న బండారి కృష్ణను మెదక్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు, తాంసి పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఈ. రమణాచారిని రిమ్స్ వైద్యకళాశాలకు, అంకోలి పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఎంఏ సమీని వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రభుత్వ వైద్యకళాశాలకు, శ్యామ్‌పూర్ పీహెచ్‌సీలో పనిచేస్తున్న భూమయ్యను భూపాలపల్లి వైద్యకళాశాలకు కేటాయించారు.