తరలింపు ప్రక్రియ షురూ | - | Sakshi
Sakshi News home page

తరలింపు ప్రక్రియ షురూ

Sep 20 2025 6:04 AM | Updated on Sep 20 2025 6:04 AM

తరలింపు ప్రక్రియ షురూ

తరలింపు ప్రక్రియ షురూ

కై లాస్‌నగర్‌: కలెక్టరేట్‌ తరలింపు ప్రక్రియ మొదలైంది. ఈ నెల 11న కురిసిన భారీ వర్షాలతో కార్యాల య ఏ–సెక్షన్‌ బాల్కనీ కుప్పకూలిన విషయం విది తమే. పరిశీలించిన ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం కార్యాలయాన్ని తరలించడమే ఉత్తమమని నివేదిక అందజేసింది. ఈనేపథ్యంలో కార్యాలయాన్ని జెడ్పీ ఎదురుగా ఉన్న ఇరిగేషన్‌శాఖ కార్యాలయమైన పెన్‌ గంగ భవన్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం ఈ ప్రక్రి య ప్రారంభమైంది. తొలుత ఏ, బి సెక్షన్లకు సంబంధించిన రికార్డులు,దస్త్రాలు, కంప్యూటర్లు, ఫర్ని చర్‌ వంటి సామగ్రి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ వా రం రోజుల్లో పూర్తికానున్నట్లు అధికారులు చెబు తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్‌లోకి ఉద్యోగులు, సిబ్బంది మినహా ఇతరులేవరినీ అనుమతించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement