
ఎనిమిదో పే కమిషన్ ప్రకటించాలి
బెల్లంపల్లి: రైల్వే కార్మికులకు ఎనిమిదో పే కమిష న్‌ను వెంటనే అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలోని సీఅండ్‌డబ్ల్యూ డిపో షెడ్, లోకో పైలట్ క్రూ లాబీ ఎదుట నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే కార్మికులపై కేంద్ర ప్ర భుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల శ్రమను గుర్తించడం లేదని పేర్కొన్నారు. ఈపాటికే ఎనిమిదో వేతన కమిషన్ ను అమలు చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో రైల్వే కార్మికులు వేతన పెంపుదల లేక తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. వేతన సంఘాన్నీ ప్రకటించి జనవరి 2026 నుంచి భేషరతుగా అమలు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సాంబశివుడు, కోశాధికారి షోకిన్ మీనా, నాయకులు నిరాజ్, అగర్వాల్, శంకరయ్య, కార్యకర్తలు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.