
టీబీ రహిత సమాజాన్ని స్థాపించాలి
తాండూర్: టీబీ రహిత సమాజాన్ని స్థాపించాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్ సూచించారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ నిర్వహించిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ పేషెంట్లు మందులతో పాటు బలమైన పోషకాహారం తీసుకుంటే చాలా తొందరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. టీబీ రహిత సమాజం కోసం టీబీ న్యూట్రిషియన్ కిట్‌లు అందించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు స్వస్త్ నారీ సశక్త్ పరివార్‌లో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్ రఘుమోహన్ ఆధ్వర్యంలో 87మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఝాన్సీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జయమేరి, సూపర్‌వైజర్లు తార, రమాదేవి, స్టాఫ్ నర్సులు షారుణ్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, టీబీ సూపర్‌వైజర్ శశికాంత్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు.