క్రిస్మస్‌ రోజు ముస్లిం రెస్టారెంట్‌ పెద్ద మనసు | Muslim owned restaurant in london offers free Christmas meal | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ రోజు ముస్లిం రెస్టారెంట్‌ పెద్ద మనసు

Dec 7 2016 8:29 AM | Updated on Sep 4 2017 10:09 PM

క్రిస్మస్‌ రోజు ముస్లిం రెస్టారెంట్‌ పెద్ద మనసు

క్రిస్మస్‌ రోజు ముస్లిం రెస్టారెంట్‌ పెద్ద మనసు

త్వరలో క్రిస్మస్‌ నేపథ్యంలో లండన్‌లోని ఓ ముస్లిం రెస్టారెంటు తన ఔదర్యాన్ని చాటుకుంది. క్రిస్మస్‌ సందర్భంగా ఆరోజు నిరాశ్రయులకు, వృద్దులకు ఉచితంగా భోజనం సౌకర్యాలు అందిస్తామని ప్రకటించింది.

లండన్‌: త్వరలో క్రిస్మస్‌ నేపథ్యంలో లండన్‌లోని ఓ ముస్లిం రెస్టారెంటు తన ఔదర్యాన్ని చాటుకుంది. క్రిస్మస్‌ సందర్భంగా ఆరోజు నిరాశ్రయులకు, వృద్దులకు ఉచితంగా భోజనం సౌకర్యాలు అందిస్తామని ప్రకటించింది. మూడు రకాల్లో ఆ రోజు డిన్నర్‌ అందిస్తామని తెలిపింది. లండన్‌ నగరంలో టర్కీ ముస్లింలకు చెందిన షిష్‌ అనే రెస్టారెంటు ఉంది. ఇది ఇక్కడ 1993లో ఏర్పాటుచేశారు. అక్కడి వారితో బాగా కలిసిపోయిన రెస్టారెంటు యజమానులు త్వరలో క్రిస్మస్‌ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.

ఇస్రాన్‌ కెన్‌ జెంక్‌ అనే ఈ రెస్టారెంటుకు చెందిన మేనేజర్‌ ఓ పత్రికకు ఈ విషయాన్ని చెబుతూ తాము క్రిస్మస్‌ రోజున ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఓ మహిళా వృద్ధురాలు చెప్పగా విన్నానని, ఆ విషయం తనను కదిలించి వేసిందని అందుకే మతానికి అతీతంగా మనుషులే ముఖ్యమనే భావనతో ఆ రోజు ఉచితంగా భోజనం వసతిని ఏర్పాటు చేస్తున్నామని, తాము ఒంటరి వాళ్లం అని భావించిన వారంతా తమ రెస్టారెంటుకు వచ్చి ఉచితంగా సంతృప్తికరమైన డిన్నర్‌ చేసి వెళ్లొచ్చని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement