Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Web Casting Hijack On and off button in Chandrababu hand
వెబ్‌ కాస్టింగ్‌ హైజాక్‌! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్‌ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ) పూర్తి ‘పచ్చ’పాతంతో పావుగా మారినట్లు వెల్లడవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్థారిస్తోంది. విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ పోలింగ్‌ బూత్‌ వీడియోలను ఎడిట్‌ చేసి విడుదల చేయడం ఏమిటి? ఏ అధికారి ద్వారా అవి లోకేష్‌కు చేరిపోయాయి? అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటవేత వైఖరి అనుసరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య వాదులను నిర్ఘాంతపరుస్తోంది. నిష్పాక్షికంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా? అని విస్తుపోతున్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితోపాటు పోలింగ్‌ రోజు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్, ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ నుంచి క్షేత్రస్థాయిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల వరకూ అందరూ టీడీపీ అక్రమాలకు అండగా నిలిచినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అదునుగా పచ్చముఠాలు ఎన్నికల వేళ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు వైఎస్సార్‌ సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయి. ఇంత చేసినా గెలవలేమనే నిస్పృహతో అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు రోజు మరోసారి విధ్వంసాలకు తెగబడేలా పథకాన్ని రూపొందించాయి. పోలింగ్‌ రోజు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ‘పచ్చ ముఠా’ పెత్తనం ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియను చంద్రబాబు ముఠా హైజాక్‌ చేయడం విస్మయం కలిగిస్తోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ఈసీకి నియంత్రణ లేదా? ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వర్గీయులైన ప్రైవేట్‌ వ్యక్తులకు అందుబాటులోకి తెచి్చందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని 46,389 ఎన్నికల కేంద్రాలకుగానూ 31,380 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డ్‌ చేశారు. అత్యంత సమస్యాత్మక 14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయట వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలతోపాటు ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లి, రాయచోటి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాలున్నాయి. ఇలాంటి వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థను చంద్రబాబు ముఠా తమ గుప్పిట్లోకి తీసుకుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ వీడియో రికార్డింగ్‌ అంటూ నారా లోకేష్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్టు చేయడం అందుకు నిదర్శనం. తాము ఆ వీడియోను విడుదల చేయలేదని ఈసీ చెబుతోంది. అలాంటప్పుడు ఎలా లీక్‌ అయింది? వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు పొక్కడం ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నిబంధనల ప్రకారం వెబ్‌ కాస్టింగ్‌ పూర్తిగా ఈసీ నియంత్రణలో ఉంటుంది. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ అయ్యే వీడియోలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. వెబ్‌కాస్టింగ్‌ లింక్‌ ను జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచారు. వాటిని కలెక్టర్‌తోపాటు ఐజీ, ఎస్పీ పరిశీలిస్తారు. వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌ కోసం ప్రైవేట్‌ ఏజెన్సీలను వినియోగించారు. పోలింగ్‌ తరువాత వెబ్‌ కాస్టింగ్‌ హార్డ్‌ కాపీని ప్రైవేట్‌ ఏజెన్సీ కలెక్టర్‌కు అందచేస్తుంది. ప్రైవేట్‌ ఏజెన్సీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ వర్గీయులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోకి చొరబడ్డారు. ‘స్వామి’ భక్తి... 7 ఈవీఎంలు ధ్వంసం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పల్నాడులో క్షేత్రస్థాయిలో పట్టు, అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఎన్నికల ముందు ఆకస్మికంగా బదిలీ చేసింది. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో బదిలీ చేయడం గమనార్హం. అంతేకాకుండా చంద్రబాబు సూచనల మేరకు పురందేశ్వరి సమరి్పంచిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్‌ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించారు. రాజకీయ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కూడా టీడీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు తదనంతర పరిణామాలు నిర్ధారించాయి. గురజాల డీఎస్పీ పల్లపురాజు, మాచర్ల సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, ఎస్సై ఎం.రామాంజనేయులను బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ ద్వారా టీడీపీ కథ నడిపింది. అత్యంత వివాదాస్పదుడైన నారాయణస్వామిని కారంపూడి సీఐగా నియమించడమే అందుకు నిదర్శనం. టీడీపీ రౌడీమూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నా, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణ స్వామి ప్రేక్షక పాత్ర పోషించారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం దాడులతో విరుచుకుపడ్డారు. సీఐ నారాయణ స్వామి పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం గమనార్హం. ఆయన పరిధిలోనే పాల్వాయి గేటు కూడా ఉంది. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయగా సీఐ నారాయణస్వామి పరిధిలో ఏడు ఈవీఎంలు ధ్వంసమైనా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఐజీ త్రిపాఠి అండగా నిలిచారు. కౌంటింగ్‌ రోజు టీడీపీ దౌర్జన్యాలకు కొమ్ము కాసేందుకే ఆయన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పిన్నెల్లిపై కుట్రపూరిత కేసు.. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో సీఐ నారాయణ స్వామి పూర్తిగా చంద్రబాబు సేవలో తరిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా గురువారం రాత్రి కేసు నమోదు చేయడమే అందుకు తార్కాణం. పిన్నెల్లిపై జూన్‌ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించగా అప్పటికప్పుడు మరో తప్పుడు కేసు నమోదు చేయడం నారాయణ స్వామి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పది రోజుల క్రితం ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో పిన్నెల్లి సోదరులను తాజాగా నిందితులుగా చేర్చడం గమనార్హం. పల్నాడులో పచ్చ ముఠాలు పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 23 గంటల రికార్డింగ్‌లో ఎడిట్‌ చేసిన రెండు నిమిషాల వీడియో క్లిప్‌ మాత్రమే విడుదల కావడం వెనుక పచ్చ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలింగ్‌కు ముందు చంద్రబాబు ఒత్తిడితో ఈసీ నియమించిన గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తోపాటు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్‌ ఈ పన్నాగంలో పాత్రధారులుగా మారారని వెల్లడవుతోంది. పల్నాడు జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ నుంచే వెబ్‌ కాస్టింగ్‌ రికార్డింగ్‌ను పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేసి లీక్‌ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ రౌడీమూకలు ఈవీఎంలను ధ్వంసం చేస్తే అవి ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నట్లు చెబుతున్న వీడియో మాత్రమే లీక్‌ కావడం వెనుక చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తేలుతోంది. మరి దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? పవన్, బాలయ్య ప్రత్యేకమా?పోలింగ్‌కు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ.. టీడీపీ, జనసేన అగ్రనేతలు యథేచ్ఛగా వ్యవహరించినా చోద్యం చూసింది. నిబంధనల ప్రకారం ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే పోలింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తారు. ఓటు హక్కులేని వారు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకూడదు. ఈ నిబంధన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సతీమణికి వర్తించదని ఈసీ భావించినట్టుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 197లో పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు హక్కులేని తన భార్య అన్నా లెజినోవాతో సహా ఆయన పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. దర్జాగా ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. దీనిపై ఈసీ కనీసం స్పందించలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, కండువాలు, కరపత్రాలు ప్రదర్శించకూడదు. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ మాత్రం మెడలో పార్టీ కండువా ధరించి వెళ్లి మరీ ఓటు వేశారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో వచ్చినా ఈసీ నోరు మెదపలేదు.

Special Article On Pithapuram Assembly Constituency 2024
వంగా గీత బలం.. ప్యాకేజ్‌ స్టార్‌ బలహీనతలు ఇవే!

ఏపీలో పోలింగ్‌ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్‌ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్‌ క్లాస్‌ చదివిన పవన్‌కల్యాణ్‌కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్‌కల్యాణ్‌ పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్‌పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్‌ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్‌ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Chittoor TDP Leaders Hand In Bangalore Rave Party
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్‌ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్‌ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్‌ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్‌ చౌదరి, సుకుమార్‌ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్‌ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడులు ఈ రేవ్‌ పార్టీకి డ్రగ్స్‌ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో జరిగిన రేవ్‌ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్‌ అబూబక్కర్‌ సిద్ధికి, ఎల్‌.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్‌ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్‌ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్‌ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్‌ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్‌వర్డ్‌ ఇచ్చారు. వాసు బర్త్‌ డే పార్టీ అనే యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్‌ సిటీ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్‌ రాకెట్‌ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్‌ చేసిన కార్లలో ఫార్చూనర్‌ కారు ఏపీ 39 హెచ్‌ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.

SRH beat RR by 36 runs, Enters IPl 2024 Final
రాజ‌స్తాన్ చిత్తు.. ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన స‌న్‌రైజ‌ర్స్‌

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫైన‌ల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో 36 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ఫైన‌ల్ పోరుకు అర్హ‌త సాధించింది. ఈ క్వాలిఫయ‌ర్‌-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్‌(34) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు సాధించాడు. తిప్పేసిన షాబాజ్..అనంత‌రం 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్‌(56) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..య‌శ‌స్వీ జైశ్వాల్‌(42) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. అయితే ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్‌ను ఎస్ఆర్‌హెచ్ స్పిన్న‌ర్ షాబాజ్ అహ్మ‌ద్ దెబ్బ‌తీశాడు. 3 వికెట్లు ప‌డ‌గొట్టి రాయ‌ల్స్ ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు అభిషేక్ రెండు.. న‌ట‌రాజ‌న్‌, క‌మ్మిన్స్ త‌లా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ పోరులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నుంది.

Aarogyasri Services Continue In Ap
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!

సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు.

Drinking Couple Argue With Morning Walkers At Nagole Goes Viral
నాగోల్‌: నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్‌ తాగుతూ యువతి హల్‌చల్‌

సాక్షి, హైదరాబాద్‌: మద్యం మత్తులో యువత చేసే వీరంగం ఎక్కువైపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఓ యువతి మద్యం మద్యం మత్తులో హల్‌చల్‌ చేసింది. నాగోల్‌ డివిజన్‌లోని ఫతుల్లాగూడ సమీపంలో శుక్రవారం ఉదయమే ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ కనిపించారు.రోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్‌ తాగుతూ అక్కడికి వచ్చే వాకర్స్‌కు ఇబ్బంది కలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని కొంతమంది చెప్పగా.. వారిపై జంట ఎదురుతిరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. పోలీసులకు ఫోన్‌ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్‌ - నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024

Delhi Court Convicts Medha Patkar In Defamation Case
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్‌ను పరువు నష్టం కేసులో ఢిల్లీ‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్‌ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గతంలో ఫైల్‌ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్‌ గుజరాత్‌లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్‌, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్‌ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది.

Elon Musk And X User Tweet Viral
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్

బిలినీయర్, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' ఇటీవల ఎక్స్(ట్విటర్)లో ఓ యూజర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఎన్ బార్క్స్‌డేల్ అనే యూజర్ ట్విటర్‌లో వచ్చిన మార్పులు గురించి, చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. ''ఐ లవ్ ట్విటర్ అంటూ.. ఇప్పటివరకు ఇందులో చెత్త ఫీచర్ ఏమిటంటే, నేను యాప్‌ని ఓపెన్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరంగా అనిపించే ట్వీట్‌ని చూస్తాను, ఆపై ఫీడ్ రిఫ్రెష్ అవుతుంది. దాన్ని మళ్ళీ కనుగొనలేకపోతున్నాను'' అని పేర్కొన్నారు. ఈ సమస్య ఎంతోమందికి ఎదురైంది. ఇది సరైనదేనా అంటూ ప్రశ్నించారు.యూజర్ ప్రశ్నకు మస్క్ రిప్లై ఇస్తూ.. అవును, మేము దీన్ని సరి చేస్తున్నాము, కాబట్టి మీరు ఆసక్తికరమైన పోస్ట్‌లను చూడటానికి వెనుకకు స్క్రోల్ చేయవచ్చు'' అని ట్వీట్ చేశారు. తన ప్రశ్నకు రిప్లై ఇచ్చిన ఇలాన్ మస్క్‌కు.. బార్క్స్‌డేల్ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ చర్చ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Yeah, we’re fixing this so you can scroll back to see interesting posts— Elon Musk (@elonmusk) May 23, 2024

Jaya Badiga, An Andhra Pradesh Native Becomes Judge In US
యూఎస్‌ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!

మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్‌ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో కమిషనర్‌గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్‌ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!)

Vishwambhara: Ashika Ranganath joins Megsastar Chiranjeevi film
సంక్రాంతికి మరోసారి...

‘‘ఓ అద్భుతమైన సినిమాటిక్‌ జర్నీకి స్వాగతం’’ అంటూ ఆషికా రంగనాథ్‌ను ఆహ్వానించింది ‘విశ్వంభర’ చిత్ర యూనిట్‌. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఓ ముఖ్యమైన పాత్రకు ఆషికా రంగనాథ్‌ని తీసుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘నా సామి రంగ’లో నాగార్జున సరసన కథానాయికగా నటించారు ఆషిక.ఆ చిత్రంలో మాస్‌ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారీ బ్యూటీ. ఆ పాత్రలో కనబర్చిన నటనే ‘విశ్వంభర’లో నటించే అవకాశం దక్కేలా చేసిందని టాక్‌. ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీగా రూపొందుతున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. ఇక ఈ సంక్రాంతికి ‘నా సామి రంగ’తో వచ్చిన ఆషిక మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపై కనిపించనున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement