
సమీకృత న్యాయస్థాన భవనంతో మేలు
వనపర్తిటౌన్: నూతన న్యాయస్థాన భవన సముదాయంతో కక్షిదారులు, ప్రజలకు ఎంతోలాభం చేకూరనుందని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్ కుమార్ అన్నారు. 20 ఎకరాల్లో 10+2 కోర్టు(పోక్సో, ఫ్యామిలీ కోర్టు కాంప్లెక్స్) భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రూ. 81కోట్లతో నిర్మించనున్న న్యాయస్థానానికి వర్చువల్‌గా 5వ, తేదీన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఆపరేష్ కుమార్ సింగ్‌ను సోమవారం వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జస్టీస్ ఆపరేష్ కుమార్ సింగ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు గోపాల్‌రెడ్డి, కె.తిరుపతయ్య, ఎండీ నిరంజన్ బాబా, నాచనల్లి రాజు, రామన్న గారి వెంకటేశ్వరరెడ్డి, నరేందర్ బాబు, ఎంఏ కలీం, తరుణ్, మల్లేష్ యాదవ్, సా యి కృష్ణ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.