
నేతన్న.. నిరాశ !
జిల్లాలో ఇలా..
●
ఏడాది పూర్తయినా అమలుకు నోచుకోని రుణమాఫీ
స్థానిక యూనియన్ బ్యాంక్‌లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. క్రమం తప్పకుండా చెల్లించడం, లేదా ఏటా వడీ చెల్లించి పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో వడ్డీ డబ్బులు చెల్లించలేదు. రుణం పునరుద్ధరించుకోవాలని.. లేని పక్షంలో ప్రతినెల రూ.750 వడ్డీ చెల్లించమంటూ బ్యాంకు మేనేజర్ వత్తిడి చేస్తున్నారు.
– కొంకతి శకుంతలమ్మ,
నేత కార్మికురాలు, అమరచింత
మా కుటుంబం చేనేతపై ఆధారపడి జీవిస్తోంది. కుటుంబ పోషణతో పాటు చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకుల కోసం బ్యాంకులో రూ.75 వేల రుణం తీసుకున్నాం. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నేటికీ వర్తించకపోవడంతో రుణం చెల్లించాలని బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేశారు. ఖాతా పునః ప్రారంభం కోసం వడ్డీ డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – గుండాల బుచ్చన్న,
నేత కార్మికుడు, అమరచింత
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీ ప్రకటించి ఏడాది పూర్తయినా నేటికీ ఆ నిధులు మంజూరు చేయకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి.
– వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, అమరచింత చేనేత సహకార సంఘం
జిల్లాలో 338 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తించనుంది. సుమారు రూ.2.21 కోట్లు కార్మికులకు అందనున్నాయి. పూర్తి వివరాలతో డీసీఎల్ కమిటీ ఆమోదం తర్వాత రాష్ట్ర కమిటీకి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే కార్మికుల ఖాతాల్లో నేరు గా రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని కార్మికులకు వివరిస్తున్నాం. రుణాల పునరుద్ధరణ వ్యవహారం తమ పరిధి కాదని మా వద్దకు వస్తున్న నేతన్నలకు వివరిస్తున్నాం. – గోవిందయ్య,
ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల
అమరచింత: రైతుల మాదిరి నేత కార్మికులకు కూడా రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తున్నామని గతేడాది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు వర్తింపజేయకపోవడం.. బ్యాంకు సిబ్బంది రుణాలు తిరిగి చెల్లించాలంటూ వత్తిడి పెంచడంతో నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చేనేత, జౌళిశాఖ అధికారులు రుణమాఫీ అర్హుల జాబితాను సదరు బ్యాంకర్ల నుంచి సేకరించి పూర్తి నివేదికను రాష్ట్ర కమిటీకి అప్పగించినా.. నేటికీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఇటీవల తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా అమరచింత యూనియన్ బ్యాంకు మేనేజర్ చేనేత కార్మికుల లావాదేవీలు నిలిపివేయడంతో కార్మికులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. రుణమాఫీ గురించి జౌళిశాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామని చెప్పిందని.. వచ్చిన వెంటనే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రతి నెల రూ.వెయ్యి వడ్డీ చెల్లించాల్సి వస్తోందని.. లేదంటే బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సానుకులంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 338 మంది కార్మికులు
అర్హులుగా గుర్తింపు
రుణగ్రస్తుల వివరాలు సేకరించినా.. ఫలితం శూన్యం
రూ.2.21 కోట్ల మాఫీపై
వీడని చిక్కుముడి
రుణాలు చెల్లించాలంటూ
బ్యాంకు సిబ్బంది వత్తిడి
జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, పెద్దమందడి, కొత్తకోటలో నేత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెద్దమందడిలోని వెల్టూర్, ఖిల్లాఘనపురంలోని సోలీపురం గ్రామంలో మాత్రం ఉన్ని మగ్గాలు కొనసాగుతుండగా.. మిగిలిన ప్రాంతాల్లో మగ్గాలపై జరి చీరలు తయారు చేస్తున్నారు. జిల్లాలో 1,090 మంది నేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు 338 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి మగ్గానికి 3 కార్మికుల చొప్పున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అమరచింత చేనేత సహకార సంఘం సభ్యులు 309 మంది స్థానిక యూనియన్ బ్యాంక్, ఆత్మకూర్‌లోని డీసీసీబీ బ్యాంకులో చేనేత రుణాలు పొందారు. ఆత్మకూర్ మండలంలోని తిప్పడంపల్లిలో ఐదుగురు, కొత్తకోటలో 24 మంది నేతన్నలు రుణాలు తీసుకున్నట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. రుణాలు పొందిన కార్మికుల వివరాలను డీసీఎల్ కమిటీ ఆమోదించి రాష్ట్ర కమిటీకి పంపి 5 నెలలు గడుస్తున్నా రుణమాఫీ నిధులు మంజూరుగాకపోవడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. 2017 నుంచి చేనేత రుణం తీసుకున్న వారి వివరాలతో పాటు మొత్తం ఎంత మేర మాఫీ అవుతుందన్న విషయాలను సైతం జౌళిశాఖ అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా 338 మంది చేనేత కార్మికులు రుణం పొందారని.. రూ.2.21 కోట్ల రుణమాఫీ నేతన్నలకు అందనున్నట్లు తెలిపారు.

నేతన్న.. నిరాశ !

నేతన్న.. నిరాశ !

నేతన్న.. నిరాశ !

నేతన్న.. నిరాశ !

నేతన్న.. నిరాశ !