వనపర్తిటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం కోసం సీఎంను కోరగా.. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మంజూరయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలుపడంతో పాటు విద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు, నిధుల మంజూరు త్వరితగతిన జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
వనపర్తి రూరల్: పెబ్బేరులోని కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయగా.. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
రూ.13.20 లక్షలు పలికిన అమ్మవారి చీరలు
వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రతిష్టించిన దుర్గాదేవికి దేవి శరవన్నవరాత్రి ఉత్సవాల్లో అలంకరించిన చీరల వేలాన్ని శనివారం రాత్రి ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు వేలంలో పాల్గొని రూ.13.20 లక్షలకు దక్కించుకున్నారు. అందులో ఒక చీరను తిరుపతిరావు అనే భక్తుడు రూ.2.05 లక్షలు పాటపాడి దక్కించుకున్నారు.
11న పీయూలో జాబ్‌మేళా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పురుష అభ్యర్థులకు ఈ నెల 11న పీయూ క్యాంపస్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్‌మెంట్ అధికారి అర్జున్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎం–ఫార్మసీ, బీ–ఫార్మసీ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్), బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్, ఐటీఐ 2021 నుంచి 2025 మధ్య ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 8లోగా
https://forms.gle/ctBZNQ1ByU5B6xKB6 రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.98494 45877ను సంప్రదించాలని సూచించారు. టీజీసీహెచ్‌సీ, జాతీయ బల్క్ డ్రగ్ తయారీదారుల సమాఖ్య సహకారంతో ఈ నెల 11 ఉదయం 10 గంటల నుంచి పీయూలోని పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఎంపికై న వారు ఆయా కంపెనీల్లో క్యూసీ, క్యూ, కెమిస్ట్, మెషిన్ ఆపరేటర్లుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు.

సీఎం చొరవతోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు