
పొంచి ఉన్న ప్రమాదం
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రామన్‌పాడు రిజర్వాయర్ వరకు ఉన్న కాల్వపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాల్వ వెంట ఉన్న కచ్చా రహదారిపై ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. మూలమళ్ల–నందిమళ్ల సమీపంలో ఉన్న ఎడమ కాల్వ వద్ద వంతెన దిమ్మెలు కూలి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకొని కాల్వ వెంట ఉన్న శిథిల వంతెనల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – అమరచింత