
‘సంక్షేమమే అభ్యర్థులను గెలిపిస్తుంది’
ఆత్మకూర్: పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలకులు చేయలేని అభివృద్ధిని 18 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా అన్నారు. శనివారం ఆత్మకూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆశావాహుల జాబితాను సేకరించారు. కాగా జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఎనిమిది మంది ముందుకు వచ్చారు. మండల అధ్యక్షుడు పరమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసీరాజ్, హుస్సేన్‌మియ్యా, బాలకృష్ణారెడ్డి, విజయలక్ష్మి, మచ్ఛేందర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, రాఘవేందర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని, ఎవరికీ బీఫాం ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జాబితాను అధిష్టానికి పంపిస్తామని త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను తదితరులు ఉన్నారు.