
అహింసతో దేనినైనా సాధించవచ్చు..
సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలకు ఆయనతోపాటు జిల్లా అధికారులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాయువులతో జాతి అభివృద్ధి చెందాలని మహాత్మాగాంధీ చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. గాంధీ జయంతి, విజయదశమి ఒకేరోజు రావడం ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సుధీర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.