
స్వగ్రామంలో గద్వాల అదనపు కలెక్టర్..
ఖిల్లాఘనపురం: నిత్యం కార్యాలయంలో విధుల్లో బిజీగా ఉండే గద్వాల అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ దసరా పండుగను తన సొంత గ్రామం మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గ్రామస్తుల నడుమ సంతోషంగా జరుపుకొన్నారు. గురువారం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం అక్కడే మహిళలు నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అక్కడి నుంచి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి గ్రామ పెద్దలతో కలిసి శమీ పూజ నిర్వహించారు. పాత మిత్రులు, పెద్దలతో సరదాగా గడిపి యోగక్షేమాలు తెలుసుకున్నారు.