
గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడంతో గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని.. స్వాతంత్య్ర సాధనలో ఆయన కృషి మరువలేనిదని ఎస్పీ రావుల గిరిధర్ కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలో ఆయన పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతావని స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం ఆయన ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. దేశాభివృద్ధికి నిస్వార్థంగా అందరం సేవలు అందించాలని.. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలు కొనసాగించడమే మనమిచ్చే ఘన నివాళులన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, సీసీఎస్ ఎస్‌ఐ జయన్న, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ రామేశ్వర్‌రెడ్డి, షీటీమ్ ఎస్‌ఐ అంజద్, రిజర్వ్ సబ్ సీఐ మొగ్దుంబారీ, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్