
వసతులు కల్పించాలి..
మండల కేంద్రంలో నిర్మించిన క్రీడా ప్రాంగణంలో వసతులు కల్పించాలి. వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు చెబుతున్న అధికారులు నెట్‌తో పాటు బాల్స్‌ను ఇవ్వడం లేదు. ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లి ఆడలేని పరిస్థితి నెలకొంది.
– చిన్నపాగ భాను,
వాలీబాల్ క్రీడాకారుడు, పాన్‌గల్
పట్టణంలో కరువు..
పట్టణంలోని పది వార్డుల్లో ఎక్కడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలాల్లో క్రీడా మైదానాలు అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి నిధులు దండుకున్నారు. కబడ్డీ, వాలీబాల్ ఆడే క్రీడాకారులకు సరైన మైదానాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
– బాలకృష్ణ, అమరచింత

వసతులు కల్పించాలి..