
సరస్వతీ నమస్తుభ్యం..
సరస్వతి నమస్తుభ్యం..
జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజు సోమవారం కొత్తకోటలోని వాసవి కన్యకాపరమేశ్వరి, అంబాభవాని ఆలయాల్లో అమ్మవార్లను అర్చకులు సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం అనంతరం మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొన్నారు.
– కొత్తకోట
యూరియా కోసం ఆందోళన వద్దు
పాన్‌గల్: రైతులు యూరియాను అవసరం మేరకు వినియోగించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని.. పుష్కలంగా అందిస్తున్నా నేటికీ రద్దీ తగ్గడం లేదన్నారు. కొందరు రైతులు సింగిల్‌విండో ద్వారా యూరియా పొంది పక్క మండలాల్లోని వారి బంధువులకు సరఫరా చేస్తుండటంతో మండలంలోనే రద్దీ ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు అందజేసినా నేటికీ యూరియా ఇవ్వలేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మండలంలో గతేడాది 11 వేల బస్తాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది ఇప్పటికే 36 వేల బస్తాలు సరఫరా చేశామని వివరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, విండో డైరెక్టర్లు సాయి ప్రసాద్‌గౌడ్, బాలరాజు, జైపాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సరస్వతీ నమస్తుభ్యం..

సరస్వతీ నమస్తుభ్యం..