
చట్టాలు అందరికీసమానమే
ఆత్మకూర్: చట్టాలకు పేద, ధనిక అనే తేడా ఉండదని.. అందరికీ సమానమని న్యాయమూర్తి శిరీష తెలిపారు. సోమవారం పట్టణంలోని మున్సి్‌ఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు న్యాయవాదులు వివిధ రకాల కేసులు, చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘అక్రమ కేసులు
ఎత్తివేయాలి’
ఆత్మకూర్: పోలీసులు ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సీఐ శివకుమార్‌తో సమావేశమై కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఇరువర్గాలకు చెందినవారు శాంతియుతంగా నిరసన తెలిపారని, అన్నాదమ్ముల్లా కలిసి జీవిస్తున్న వారి మధ్య విభేధాలు సృష్టించే విధంగా పోలీసుల చర్యలు ఉండటం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని సీఐను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్, మార్కె ట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు చెన్నయ్య, రామకృష్ణ, జానకిరాం, మాసన్న, కొత్తబోయ శేఖర్, రియాజ్‌అలీ, భీమన్న, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులు భువనచంద్ర, దినకరన్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ 65 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

చట్టాలు అందరికీసమానమే

చట్టాలు అందరికీసమానమే