
తొలివిడత వనపర్తి నియోజకవర్గ మండలాలకే..
వనపర్తి: జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. తొలి విడతలో వనపర్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండోవిడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు, మక్తల్ నియోజకవర్గంలోని రెండు మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలోని రెండు మండలాలు మొత్తం ఏడు మండలాల పరిధిలోని 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 11న 15 జెడ్పీటీసీ, 133 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరగనుండగా.. జిల్లాలో రెండో విడతలో 135 గ్రామపంచాయతీలు, మూడో విడతలో 133 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలు : వనపర్తి, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల, శ్రీరంగాపురం, పెబ్బేరు
రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాలు : పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత
రిజర్వేషన్ మహిళలు జనరల్ మొత్తం
స్థానాలు
జనరల్ 16 25 41
బీసీ 23 33 56
ఎస్సీ 9 15 24
ఎస్టీ 3 9 12
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్‌పై ఇప్పటికే హైకోర్టులో కేసు కొనసాగుతుండగా.. తుది తీర్పు అక్టోబర్ 8న వెలువడనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు సైతం అనుచరులకు వాయిదా విషయంపై సంకేతాలు ఇవ్వడం గమనార్హం.