
తీరొక్క పువ్వేసి చందమామ..
బతుకమ్మకు పూజలు నిర్వహిస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం జిల్లా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మకు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అన్నారు. రెవెన్యూ, క్రీడలు, ప్రణాళిక, ఆర్‌అండ్‌బీ, పౌరసరఫరాలు, ఎంప్లాయిమెంట్‌శాఖ
ఉద్యోగులు ఆడిపాడారు. కార్యక్రమంలో ఏఓ భానుప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఏడీ లాండ్ సర్వే బాలకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. – వనపర్తి