
ఐలమ్మ ఆదర్శం..
తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమస్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూములను ఆక్రమించుకున్న నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అని, తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె ధైర్య సాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ తరం వారికి ఆమె ఆదర్శమని, ఆమె ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, కార్యాలయ ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.