
జిల్లాలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
● గోపాల్‌పేట మండలం చెన్నారం
మద్యం దుకాణం హైదరాబాద్‌లోని
లింగంపల్లికి బదలాయింపు
● గత మద్యం పాలసీ దరఖాస్తులతో రూ.26.58 కోట్ల ఆదాయం
● ఈసారి రూ.50 కోట్ల వరకు
ఆదాయం వస్తుందని అధికారుల అంచన
వనపర్తి: గత ప్రభుత్వ హయాంలో రెండేళ్ల కిందట నిర్వహించిన మద్యం పాలసీ గడువు నవంబర్ 30తో ముగియనుంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కొత్త మద్యం పాలసీకి సంబంఽధించిన దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభించగా.. అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. ఒక్కో దుకాణానికి టెండర్ దాఖలుకు రూ.3 లక్షల డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గత మద్యం పాలసీలో జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలకు టెండర్లు నిర్వహించి లక్కీడిప్ విధానంలో కేటాయించారు. ఈసారి గోపాల్‌పేట మండలం చెన్నారం గ్రామంలో ఉన్న దుకాణంలో విక్రయాలు ఆశించిన మేర లేవని ఎకై ్సజ్ అధికారులు హైదరాబాద్‌లోని లింగంపల్లిలో ఏర్పాటుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 36 దుకాణాలకే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
రికార్డుస్థాయిలో విక్రయాలు..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, గ్రామదేవతల ఉత్సవాలు, పండుగలతో పాటు సాధారణ మద్యం విక్రయాలు రికార్డుస్థాయికి చేరాయి. ఒక్క వనపర్తి జిల్లాలోనే రెండేళ్ల కాలంలో ఏకంగా సుమారు రూ.వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆశించిన మేర లక్ష్యాన్ని పూర్తిచేసి ప్రభుత్వ ఖజానాకు తమవంతుగా ఆదాయం సమకూర్చామనే సంబరం ఎకై ్సజ్ అధికారుల్లో కనిపిస్తోంది. గత మద్యం పాలసీలో రెండేళ్ల కాల పరిమితికిగాను ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల డీడీ జత చేయాల్సి ఉండేది. ఈ నగదు తిరిగి చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి రూ.26.58 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత మద్యం పాలసీలో రెండేళ్ల కాలానికి ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ వినిపిస్తోంది. ఈ లెక్కన దరఖాస్తుల ఆదాయం గతంతో పోలిస్తే రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎకై ్సజ్ అధికారులు సైతం రూ.50 కోట్ల ఆదాయం దరఖాస్తులపై ఆశిస్తున్నట్లు సమాచారం. మరో రెండు నెలల పాటు మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయాన్ని రెండళ్ల సరాసరి అమ్మకాల మొత్తానికి కలుపాల్సి ఉంటుంది.