
‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం
కొత్తకోట రూరల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, వేముల శ్రీనివాస్‌రెడ్డి, బీచుపల్లియాదవ్, మాసన్న, మోహన్‌రెడ్డి, సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.