
బతుకమ్మ.. బతుకమ్మా...
కలెక్టరేట్ ఆవరణలో రెండోరోజు గురువారం బతుకమ్మ సంబరాలను జిల్లా విద్య, ఇంటర్మీడియట్ విద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య పాల్గొని బతుకమ్మకు పూజలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలకు విద్యార్థులు అద్భుత రీతిలో బతుకమ్మ ఆడారు. ప్రజలు పర్యావరణంతో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– వనపర్తి

బతుకమ్మ.. బతుకమ్మా...

బతుకమ్మ.. బతుకమ్మా...