
కొత్తకోట అభివృద్ధికి రూ.15 కోట్లు
● దేవరకద్ర ఎమ్మెల్యే
జి.మధుసూదన్‌రెడ్డి
కొత్తకోట: స్థానిక పురపాలికలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను పుర కమిషనర్ సైదయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే బుధవారం పట్టణంలో అందజేసి మాట్లాడారు. ఇందులో డ్రెయినేజీలు, సీసీ రహదారుల నిర్మాణాలకు రూ.6 కోట్లు, శనిగ చెరువుకట్ట అభివృద్ధి, సంతబజార్ ఏర్పాటు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.5 కోట్లు, పట్టణంలోని పార్క్‌ల అభివృద్ధికి రూ.2 కోట్లు, మొక్కల సంరక్షణ, మీడియన్ ప్లాంటేషన్‌కు రూ.50 లక్షలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మురుగు కాల్వలు, రహదారుల మరమ్మతుకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు వివరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్ కుమార్, స్థానిక నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, డా. పీజే బాబు, పెంటన్నయాదవ్, సుభాష్, రవీంధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సంద వెంకటేశ్, శంకర్‌యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా..
మదనాపురం: నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ముందుండి పని చేస్తానని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించడంతో మహిళా సంఘాల సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కుటుంబ దోపిడీ తప్ప చేసిందేమీ లేదని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సమన్వయ కమిటీ అధ్యక్షుడు మహేష్, అఽధికారులు, మహిళలు పాల్గొన్నారు.