
త్వరగా పూర్తి చేయాలి..
వానాకాలం సాగుచేసిన వరి ప్రస్తుతం పొట్టదశలో ఉంది. అంతేగాకుండా అదిక వర్షాలతో పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట వివరాలను ఆన్‌లైన్‌లో త్వరితగతిన నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుంది.
– రాజు, రైతు, అమరచింత
పొలం నుంచే నమోదు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం వద్దే ప్రత్యేక యాప్‌లో రైతులు సాగు చేసిన పంట వివరాలు, రైతు, పంట ఫొటోలతో నమోదు చేస్తున్నాం. పంట వివరాల నమోదుతో చేకూరే లాభాలను వివరిస్తూ నమోదు చేసుకుంటున్నాం.
– అరవింద్. ఏఓ, అమరచింత
రైతుల ప్రయోజనాల కోసమే
రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంటల సాగు వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయిస్తోంది. జిల్లాలో జూలై పదో తేదీ నాటికి వివిధ రకాల పంటలు 2,45,356 ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిసింది. అన్నిరకాల పంట వివరాలను వేగవంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం.
– దామోదర్, ఏడీఏ, కొత్తకోట
●

త్వరగా పూర్తి చేయాలి..

త్వరగా పూర్తి చేయాలి..