
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
అమరచింత: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలు, చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలోని డీఎంఆర్‌ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కంటి, దంత వైద్య పరీక్షలతో పాటు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. శ్రావ్యా, డా. మానస, డా. ఫయాజ్, సీహెచ్‌ఓ సురేష్‌కుమార్, హెల్త్ సూపర్‌వైజర్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.