సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి | - | Sakshi
Sakshi News home page

సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి

Sep 24 2025 7:49 AM | Updated on Sep 24 2025 7:49 AM

సేవాస

సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి

‘ఎన్‌ఎస్‌ఎస్‌’తో విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవాటు

2025–26 క్యాంపుల నిర్వహణకు నిధులు విడుదల

స్వచ్ఛత, పరిశుభ్రత, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన

జనాభా సంఖ్య, పిల్లలు, వ్యాధులు తదితర అంశాలపై సర్వే

పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు

నిధులు విడుదల చేశాం

2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

– ప్రవీణ, పీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌

అవగాహన పెంపు

విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం.

– గాలెన్న, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగాం అధికారి

వారం రోజులు సామాజిక

కార్యక్రమాలు

క్యాంపులో వారం రోజుల పటు ఎంపిక చేసుకున్న గ్రామం, ప్రాంతంలో విద్యార్థులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వారికి అధికారులు భోజనం, వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, చెత్తా చెదారాన్ని ఊడ్చడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం, ఉదయం వేళల్లో స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పిస్తారు. చివరి రెండు రోజులు గ్రామంలో ఉండే ప్రజల వివరాలు, వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు, తాగునీరు, అందుతున్న వైద్య సేవలు, అధికంగా ప్రబలుతున్న రోగాలు తదితర అంశాలపై సర్వే నిర్వహించి సంబంధిత నివేదికను గ్రామ, పీయూ అధికారులకు అందిస్తారు. నివేదికలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ఆస్కారం ఉంది. పలు చోట్ల ప్రజలకు అవసరమైన మెడికల్‌ క్యాంపులను సైతం నిర్వహించి ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తారు.

మ్మడి జిల్లావ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపులు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిధులు విడుదల చేశారు. ఈమేరకు ఇప్పటికే పలు చోట్ల క్యాంపులు ప్రారంభమయ్యా యి. పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు ఉండగా.. 45 మంది విద్యార్థులు (వలంటీర్ల)తో ఒక్కో యూనిట్‌ను ఏర్పాటు చేశారు. క్యాంపునకు అయ్యే ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు రూ.35 వేల చొప్పున మంజూరు చేశారు. మొత్తం పీయూ పరిధిలో 100 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఉండగా అందులో మొదటి విడతగా 51 యూనిట్లకు అధికారులు రూ. 17.75 లక్షలను విడుదల చేశారు. ఇక్కడ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఎన్‌ఎన్‌ఎస్‌ ద్వారా సర్టిఫికెట్లను అందిస్తారు. వాటితో అడ్మిషన్లు తదితర విషయాల్లో ఎన్‌ఎన్‌ఎస్‌ సర్టిఫికెట్‌ కీలకంగా మారనుంది.

ఉమ్మడి జిల్లా వివరాలిలా..

విద్యార్థులకు ప్రయోజనం

ఎన్‌ఎన్‌ఎస్‌లో భాగంగా ఇప్పటికి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. వాటిలో భాగంగా ప్రజలకు స్వచ్ఛబారత్‌, నషా ముక్త్‌భారత్‌ వంటి వాటిపై అవగాహన కల్పించారు. వీటి ద్వారా అనేక అంశాలను ఒక విద్యార్థిగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ బవిష్యత్తులో ఎంతో ఉపయోగడపతుంది. – సరిత, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌

సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి 1
1/2

సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి

సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి 2
2/2

సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement