
క్రీడలకు వనపర్తి తలమాణికం
వనపర్తి: క్రీడలు, విద్యకు వనపర్తి జిల్లా ప్రసిద్ధి చెందిందని.. ఈ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకురావడం గర్వించదగ్గ విషయమని డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈనెల 21న ప్రారంభమైన 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా క్రీడలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజులపాటు ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర విభాగం నుంచి పది జట్లు, బాలికల విభాగం నుంచి 10జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో విన్నర్‌గా హైదరాబాద్ జట్టు, బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లా డారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపించడం అభినంద నీయమన్నారు. కార్యక్రమంలో సెపక్ తక్రా అసోసి యేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్‌ఐ జలేందర్‌రెడ్డి, జిల్లా యూత్ స్పోర్ట్స్ అధికారి సుధీర్‌రెడ్డి, రిటైర్డ్ పీడీ భాస్కర్‌గౌడ్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్, నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

క్రీడలకు వనపర్తి తలమాణికం