
అర్జీలు సత్వరం పరిష్కరించండి
వనపర్తి: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ప్రజలకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 28 అర్జీలు అందినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

అర్జీలు సత్వరం పరిష్కరించండి