
వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
వనపర్తిటౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ దేవాలయాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపాల్లో దుర్గామాత ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భవానీ దీక్ష స్వీకరించారు. మొదటి రోజు దుర్గామాతకు అష్టోత్తర, లలితా సహస్రనామావళితో సామూహికంగా కంకుమార్చన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామాలయం, అయ్యప్ప, చౌడేశ్వరి, బ్రహ్మంగారి ఆలయాల్లో అమ్మవారిని బాలత్రిపురసుందరిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 కలశాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చి వాసవీ కన్యకా పరమేశ్వరిదేవికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత మంగళగౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు