
పూత రాలింది..
ఈసారి ఐదు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి అయింది. గత నెల విరివిగా కురిసిన వర్షాలకు పత్తి మొక్కలు మెత్తగా మారి ఆకులు రంగులు మారడంతో పాటు పూత రాలిపోయింది. కాయలు సైతం తెగుళ్ల బారిన పడటంతో పత్తి బయటపడటం లేదు. ఈసారి ఎకరాకు కేవలం 2 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
– లక్ష్మన్న,
రైతు, మదిగట్ల (పెద్దమందడి)
5 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. అధిక వర్షాలు, తెగుళ్లతో ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే కాయల ద్వారా పత్తి బయటపడింది. ఇదికూడా ఎకరాకు 2 క్వింటాళ్ల వరకు మాత్రమే చేతికందే పరిస్థితి ఉంది. రూ.500 కూలి చెల్లిస్తూ ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పత్తి ఏరుతున్నాం.
– అమడబాకుల సుజాత, కొంకన్వానిపల్లి
ఈసారి మూడు ఎకరాల్లో పత్తి సాగుచేశా. తెగుళ్లు సోకి పత్తి కాయలు రాలిపోయాయి. కేవలం 1.50 ఎకరాల పంట మాత్రమే చేతికందే అవకాశం ఉంది. నష్టాలు తప్పడం లేదు.
– లక్ష్మి, రైతు, కొంకన్వానిపల్లి
ఈసారి అధిక వర్షాలతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గుతోంది. తెగుళ్ల నుంచి పంటను కాపాడేందుకు రైతులకు సూచనలు, సలహాలిచ్చినా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు ఎర్రబడ్డాయి. రైతులు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పంట నష్టపోయిన రైతుల నివేదిక సిద్ధం చేసి పంపిస్తాం.
– దామోదర్, ఏడీఏ, కొత్తకోట
●

పూత రాలింది..

పూత రాలింది..

పూత రాలింది..